
నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నుండి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టును ఆశ్రయించారు, తమిళనాడు లోని చంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్ కోర్టులో ఆమె పిటీషన్ వేయగా దానిని అక్కడి ఫ్యామిలీ కోర్టుకు మార్చారు. ప్రస్తుతం ఇద్దరం విడిపోయి జీవిస్తున్నామని , భార్యభర్తల బందానికి విజయ్ ద్రోహం చేశారని, విడాకులు ఇవ్వాలని అందులో కోరారు. 2021లో ఆయనకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తనకు తెలిసిందని, కాని విజయ్ ఆమెకు దూరంగా ఉంటానని తనకు మాటిచ్చారని కానీ మాట తప్పారని ఆమె తన పిటీషన్ లో పేర్కొన్నారు. దీంతో న్యాయస్థానం విజయ్ కు కోర్టుకు హాజరుకావాలని నోటీసు ఇచ్చింది. విజయ్, సంగీతలకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు.















