Namaste NRI

అమెరికాలో కేసులపై …క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్

అదానీ గ్రూపు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. అదానీ గ్రూపు చైర్మెన్ గౌతం అదానీ, ఆయ‌న మేన‌ల్లుడు సాగ‌ర్ అదానీ , సీనియ‌ర్ ఎగ్జ‌క్యూటివ్ వినీత్ జైన్‌పై అమెరికాలో ఎటువంటి లంచం నేరారోప‌ణ‌లు లేవ‌ని ఆ గ్రూపు త‌న ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు అవాస్త‌వ‌మ‌ని అదానీ గ్రీన్ సంస్థ పేర్కొన్న‌ది. తాజాగా ఇచ్చిన స్టాక్ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో ఈ విష‌యాన్ని ఆ సంస్థ వెల్ల‌డించింది.

అమెరికాలోని ఫారిన్ క‌ర‌ప్ష‌న్ ప్రాక్టీసెస్ యాక్టును గౌతం అదానీ ఉల్లంఘించిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజం కాదు అని అదానీ గ్రీన్ ఎన‌ర్జీ సంస్థ తెలిపింది. అదానీ గ్రూపు డైరెక్ట‌ర్ల‌పై మూడు నేరాభియోగాలు ఉన్నాయని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. అదానీ గ్రూపు స‌భ్యుల‌పై అమెరికా న్యాయ‌శాఖ మొత్తం అయిదు ఆరోప‌ణ‌లు చేసిం ద‌ని, కానీ దాంట్లో మొద‌టి, అయిద‌వ నేరాభియోగాల్లో గౌతం అదానీ, సాగ‌ర్ అదానీ, వినీత్ జైన్ లేర‌ని సంస్థ వెల్ల‌డించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events