Namaste NRI

డెకాయిట్‌ నుంచి అడివి శేష్‌- మృణాల్‌ ఠాకూర్‌ లవ్‌ సాంగ్‌ రిలీజ్‌

అడివి శేష్‌ హీరోగా రూపొందుతున్న రివైంజ్‌ యాక్షన్‌ డ్రామా డెకాయిట్‌. మృణాళ్‌ఠాకూర్‌ కథానాయిక. షానియల్‌ డియో దర్శకుడు. సుప్రియా యార్లగడ్డ నిర్మాత. ఏప్రిల్‌ 10న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఈ సినిమా నుంచి లవ్‌ మెలొడీ సాంగ్‌ని విడుదల చేశారు. ప్రేమ, భావోద్వేగాల కలయికతో సాగే ఈ రుబారూ సాంగ్‌ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు.

మళ్లీ మళ్లీ నిన్నే.. చూడాలని అంటున్నది మనసే.. కాసేపు నువ్వునేను కలిసీ.. క్షణంలో లోకమంతా తెలిసీ అంటూ హీరోహీరోయిన్ల ప్రేమలోని గాఢతను ఆవిష్కరిస్తూ గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్‌ ఈ పాట రాశారు. భీమ్స్‌ సిసిరోలియో ఈ పాటను స్వరపరచి, చిన్మయితో కలిసి ఆలపించారు. అడివి శేష్‌, మృణాళ్‌ ఠాకూర్‌ పాత్రల సహజమైన కెమిస్ట్రీని ఈ పాటలో చూడొచ్చు. ఈ చిత్రానికి సహనిర్మాత: సునీల్‌ నారంగ్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events