అంతర్జాతీయ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 77వ ఎమ్మీ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్‌లోని పికాక్ థియేటర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఎమ్మీ అవార్డులు అనేవి అమెరికన్ టెలివిజన్ పరిశ్రమలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాటికి ఇచ్చే ప్రత్యేక గౌరవం. ఈ అవార్డులని అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తుంది. ఈసారి నామినేషన్ల బరిలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు పోటీ పడ్డాయి. అందులో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘అడాల్సెన్స్ ఘన విజయం సాధించి ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఇందులో నటించిన ఓవెన్ కూపర్, చిన్న వయసులోనే ఎమ్మీ అవార్డు గెలుచుకుని కొత్త రికార్డు సృష్టించాడు.

ఈ వేడుకలో 2024-2025 సీజన్లో ప్రసారమైన కార్యక్రమాలకి అవార్డులని అందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన అడోలెసెన్స్, ఆర్కేన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ సిరీస్ అవార్డులని దక్కించుకున్నాయి. ఇక సెవరెన్స్ డ్రామా సిరీస్‌లో అద్భుతమైన నటనకు గాను ట్రామెల్ టిల్మాన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోగా, ఆయన తొలి నల్లజాతి సంతతికి చెందిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.















