చంద్రునిపై పరిశోధనల కోసం పెరెగ్రైన్ ల్యాండర్-1ను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. సోమవారం తెల్లవారుజామున ఫ్లోరిడాలోని కేప్ కనేవెరల్ స్పేస్ స్టేషన్ నుంచి పెరెగ్రైన్ ల్యాండర్-1తో కూడిన వుల్కాన్ సెంటోర్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 2024 ఫిబ్రవరి 2న ఇది చందమామపై ల్యాండ్ కానుంది. 1972 తర్వాత అపోలో మిషన్ తర్వాత అంటే 51ఏళ్ల తర్వాత నాసా నుంచి అమెరికా చంద్రుడిపైకి పంపుతు న్న లూనార్ మిషన్ ఇదే కావడం గమనార్హం. 2030 తర్వాత చంద్రుడిపైకి మానవ సహిత మిషన్‌కు సన్నాహా లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వాతావరణ పరిస్థితులను పెరెగ్రైన్ ల్యాండర్-1 అధ్యయనం చేయనుం ది. ల్యాండర్‌లోని ఐదు పేలోడ్స్, 15 ఇతర భాగాలు చంద్రుడి మీద రేడియేషన్ స్థాయులు, నీటి, మంచు జాడలు, అయిస్కాంత క్షేతాలపై అధ్యయనం చేయనున్నాయి.














