సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ స్వీయ దర్వకత్వంలో తెరకెక్కించిన చిత్రం సురాపానం. కిక్ అండ్ ఫన్ అన్నది ఉపశీర్షిక. అఖిల్ భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ప్రగ్యా నయన్ కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు సాగర్ కె.చంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్ బాగుంది. మంచి థ్రిల్‌తో పాటు చక్కటి వినోదాన్ని అందిస్తున్న చిత్ర బృందానికి శుభాకాంక్షలు అన్నారు. ఇదొక పాంటసీ థ్రిల్లర్. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. మే చివరి వారంలో విడుదల చేస్తాం అన్నారు హీరో, దర్శకుడు. ఈ చిత్రంలో అజయ్‌ఘోష్, సూర్య, ఫిష్వెంకట్, మీసాల లక్ష్మణ్, చమ్మక్ చంద్ర, సురభి ప్రభావతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.














