ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. భారత్-ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, కాల్పుల విరమణపై చర్చించినట్లు ప్రధాని తెలిపారు. రష్యాతో రెండేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. శాంతి కోసం అన్ని ప్రయత్నాలకు భారతదేశం కట్టుబడి ఉంది. ఇరుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. చర్చలు, దౌత్య మార్గాల్లో యుద్ధం ముగింపునకు ప్రయత్నిస్తామని జెలెన్‌స్కీకి మోదీ చెప్పారు. అదే సమయంలో ఉక్రెయిన్‌కు మానవతా సహాయాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం సైతం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ చెప్పినట్లు తెలిపారు. అయితే, ఉక్రెయిన్‌కు భారత్ అందిస్తున్న మానవతా సాయాన్ని జెలెన్‌స్కీ ప్రశంసించారు. వివిధ అంశాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.