Namaste NRI

అల్లు వారి పెళ్లి సందడి.. పవన్ కల్యాణ్, నాగబాబులకు అందిన ఆహ్వానం

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. మార్చి 6న జరగనున్న తన వివాహ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రికల పంపిణీలో శిరీష్ బిజీగా ఉన్నారు. తాజాగా అల్లు శిరీష్ తన తల్లిదండ్రులు అల్లు అరవింద్, నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి ఆన్నా లెజ్నేవాకు పెళ్లి శుభలేఖను అందజేసి ఆహ్వానించారు.

పవన్ కళ్యాణ్‌తో పాటు మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, ఆయన భార్య పద్మజను కూడా శిరీష్ దంపతులు కలిసి వివాహానికి రావాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు నా పెళ్లి జరుగుతుండడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు అని శిరీష్ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events