ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ యుద్ధ ట్యాంక్‌ను నడిపారు. శిక్షణ విన్యాసాల్లో ఈ ఘటన చోటుచేసు కున్నది. తాను నడిపిన ట్యాంక్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని అన్నారు. కిమ్‌తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్ నామ్, ఇతర అధికారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అద్భుతమై రీతిలో విన్యాసాలు జరిగినట్లు పేర్కొన్నారు. శిక్షణ సమయంలో ట్యాంక్‌లు టార్గెట్లను పేల్చివేశాయి. యుద్ధ ట్యాంక్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు కిమ్ తెలిపారు. ఓ ట్యాంక్ నుంచి తలను బయటకుపెట్టిన కిమ్ ఫోటోను రిలీజ్ చేశారు. డ్రిల్స్‌లో భాగంగా లైవ్ ఫైరింగ్, బాంబింగ్, ఎయిర్ అజాల్ట్, మిస్సైల్ ఇంటర్‌సెప్షన్ లాంటి విన్యాసాలు చేపట్టారు. అమెరికా, దక్షిణ కొరియా దళాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా వ్యతిరేకిస్తోంది.
