భారత్ జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న రష్యా ఆరోపణలను అగ్రరాజ్యం కొట్టిపారేసింది. తమంటతాముగా ఏ దేశ ఎన్నికల వ్యవహారాల్లో కలుగజేసుకునేది లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ అన్నారు. వాస్తవానికి తాము భారత్‌తోపాటు ప్రపంచంలో ఏ ఎన్నికల విషయంలో తాము కల్పించుకోబోమని తెలిపారు. అది భాతరదేశ ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేశారు. భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నదంటూ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.