అగ్రరాజ్యం అమెరికా గగనతలంలో మరోసారి బెలూన్ కలకలం సృష్టించింది. పశ్చిమం దిశగా ప్రయాణిస్తోన్న దానిని యుద్ధ విమానాలు అడ్డగించాయి. ఫిబ్రవరి 23న ఈ ఘటన చోటుచేసుకుందని, అయితే ఇంకా దానిని కూల్చివేయలేదని అమెరికా అధికారులు ధ్రువీకరించినట్లు మీడియా కథనాలు వెల్లడిరచాయి. ఆ బెలూన్ వల్ల దేశ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ బెలూన్ ఏ దేశం లేదా ఏ సంస్థదో తెలియాల్సి ఉంది. అలాగే దాని ప్రయోగం వెనక ఉద్దేశం కూడా వెల్లడి కాలేదు. యుద్ధ విమానాలు అడ్డగించ డానికి ముందు ఈ బెలూన్ కొలరాడో, యూటా గగనతలాల్లో కనిపించదని కొందరు అధికారులు తెలిపారు. దానికి స్వయంచోదక సామర్థ్యం లేదని స్పష్టం చేశారు.