అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది. అరుణాల్‌ను దక్షిణ టిబెట్‌గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా, అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణాచల్ భారత్‌లో అంతర్భాగంగా వాషింగ్టన్ గుర్తిస్తున్నదని అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతి నిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు. సైన్యం లేదా పౌరులు వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) అవతల ఆక్రమణలకు పాల్పడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు.