Namaste NRI

మహిళలకు ఉచితంగా డైమండ్‌ డెకాయిట్‌

స్వీయ నిర్మాణంలో పార్ధా గోపాల్‌ హీరోగా నటించిన చిత్రం డైమండ్‌ డెకాయిట్‌. సూర్య జి యాదవ్‌ దర్శకత్వం వహించారు. మేఘనా రెడ్డి కథానాయిక. సీనియర్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ట్రైలర్‌ను వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు. ప్రతీ కుటుంబానికి కనెక్ట్‌ అయ్యే కథ ఇదని, మహిళలకు నాలుగు షోలను ఉచితంగా ప్రదర్శిస్తామని, మహిళా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని మేకర్స్‌ కోరారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: పీఆర్‌, నిర్మాత: పార్ధా గోపాల్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సూర్య జి యాదవ్‌.

Social Share Spread Message

Latest News