Skip to main content

Namaste NRI

వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న అహోం ప్రారంభం

వివేక్‌ మిశ్రా, శృతిక జంటగా రూపొందనున్న సినిమా అహోం. ప్రసాద్‌రాజు దర్శకుడు. దశరథ్‌ నిర్మాత. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ పానిండియా చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌ లో జరిగింది. నిర్మాత కె.ఎస్‌.రామారావు, దర్శకుడు వి.వి.వినాయక్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. వాణిజ్య విలువలతో కూడిన తాజా కథతో ఈ సినిమా రూపొందనున్నదని, దర్శకుడు ప్రసాద్‌రాజు అద్భుతమైన కథను రాసుకున్నారని నిర్మాత దశరథ్‌ చెప్పారు. అజయ్‌ ఘోష్‌, శాండీ, కోటకొండ కృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ ఆనెం, సంగీతం: వివేక్‌-పునీత్‌, నిర్మాణం: ఈగల్‌ ఐ స్టూడియో ఇంటర్నేషనల్‌.


Social Share Spread Message

Latest News