గిన్నిస్ రికార్డ్ ఎక్కాలని ఓ యువతి చందమామలాటి రూపాన్ని ఛండాలం చేసుకుంది. ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకుంది. చివరకు కళ్లు, పెదవులు, నాలుకను కూడా వదల్లేదు. ఒంటిపై ఇలా లెక్కలేనన్ని పచ్చ బొట్లు వేసుకుని, చిరరికి అనుకున్నది సాధించింది. ప్రపంచంలోనే అత్యంధిక పచ్చబొట్టు కలిగిన వ్యక్తిగా ఆమె గిన్నీస్ రికార్డుకెక్కింది. అత్యధిక పచ్చ బొట్లు కలిగిన వ్యక్తిగా అమెరికా మహిళ ఎస్పరెన్స్ లుమినెస్కా ఫ్యూయెర్‌జినా(36) గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 99.98 శాతం శరీరాన్ని ఆమె పచ్చబొట్లతో నింపేశారు. చీకటిని అందంగా మార్చడం అనే ఇతివృత్తంతో తన దేహాన్ని కాన్వాస్‌గా మార్చుకున్నారు.
బ్రిడ్జ్‌పోర్ట్‌కు చెందిన ఈ మాజీ ఆర్మీ ఉద్యోగిని అందమైన డిజైన్ల పచ్చబొట్లతో శరీరాన్ని నింపేశారు. గిన్నిస్ రికార్డ్ కలిగిన వారిని ప్రశంసిస్తూ పెరిగిన ఆమె తనకు రికార్డ్ దక్కడంపై కృతజ్ఞతలు తెలిపారు. మహిళల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి పచ్చబొట్ల రికార్డ్‌తో ప్రయత్నించానని చెప్పారు.ఇక అందమైన డిజైన్ల పచ్చ బొట్లతో శరీరాన్ని నింపేసిన ఈ యువతి అంకిత భావానికి గిన్నిస్ రికార్డ్ అధికారులు కూడా ఫిదా అయినట్లు ఉన్నారు. ఆమె శ్రమను ప్రశంసిస్తూ ఆమె పేరిట రికార్డును అందించారు. ఈ అరుదైన రికార్డ్ తనకు దక్కడం పై కృతజ్ఞతలు తెలిసింది.