Namaste NRI

వారితో పిల్లల్ని కనేది లేదంటున్న అమెరికా మహిళలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయాన్ని ఆయన మద్దతుదారులు పండుగలా జరుపుకుం టుండగా, మరోవైపు కొందరు అమెరికన్‌ మహిళలు సోషల్‌ మీడియా వేదికగా కొత్త ఉద్యమానికి నాంది పలికారు. రెండు రోజులుగా కొందరు యువతులు, మహిళలు 4బీ ఉద్యమం ప్రారంభించారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపుతో మహిళల హక్కులకు భంగం వాటిల్లుతుందని వీరు భావిస్తున్నారు. అబార్షన్‌ హక్కులు, లింగ సమానత్వం, అమెరికా ప్రజాస్వామ్య భవిష్యత్తు పట్ల సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ను గెలిపించి తమ హక్కులను ప్రమాదంలో పడేసిన మగవారిని శిక్షించాలని నిర్ణయించారు. ఈ ఆలోచనలో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ 4బీ ఉద్యమం.

4బీ అంటే.. నో బేబీస్‌, నో బాయ్‌ఫ్రెండ్స్‌, నో బ్రాంచెస్‌, నో బైండింగ్‌. ట్రంప్‌నకు ఓటేసిన వారితో పిల్లలను కనబోమని, వారితో డేటింగ్‌ చేయబోమని, ఎలాంటి బంధాలను కొనసాగించబోమని, శారీరకంగా కలవబోమనేది ఈ నినాదం వెనుక ఉన్న అర్థం. కొందరు దీనిని సెక్స్‌ స్ట్రైక్‌ అని కూడా అంటున్నారు. ట్రంప్‌నకు ఓటేసిన పురుషులకు ఇది తాము విధించే శిక్ష అని, ట్రంప్‌ అధ్యక్షుడిగా కొనసాగనున్న నాలుగేండ్లు తాము ఈ ప్రతిజ్ఞకు కట్టుబడి ఉంటామని చెప్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నాలుగేండ్లు తాము ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉండబోమని చెప్తూ ఫోన్లలో డేటింగ్‌ యాప్‌లను డిలీట్‌ చేస్తున్నారు. ట్రంప్‌ అధ్యక్షకాలంలో తాను సింగిల్‌గా ఉంటానని ప్రతిజ్ఞ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events