Namaste NRI

చరిత్ర సృష్టించనున్న అమెరికా ప్రథమ మహిళ!

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ చరిత్ర సృష్టించనున్నారు. ఐరాస భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఈసారి యునైటెడ్‌ స్టేట్స్‌ చేపట్టిన క్రమంలో ఆ దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ మార్చి 2న జరిగే సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఒక సిట్టింగ్‌ అమెరికన్‌ ప్రథమ మహిళ ఇలా కౌన్సిల్‌కు అధ్యక్షత వహించడం ఇదే ప్రథమం. న్యూయార్క్‌లో జరిగే ఈ సమావేశం సంఘర్షణ ప్రాంతాల్లో పిల్లలు, సాంకేతికత, విద్య తదితర అంశాలపై దృష్టి సారిస్తుందని వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి. సహనం, శాంతికి మార్గంగా విద్య ప్రాధాన్యతను మెలానియా ఈ సమావేశంలో నొక్కి చెప్పనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events