అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 నుంచి 15 సంవత్సరాల వయసున్న చిన్నారులకు ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ అందించేందుకు అనుమతించింది. రెండు డోసుల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవడానికి మధ్య కనీసం 5 నెలల గ్యాప్ ఉండాలని చెప్పింది. ఇంతకుముందు ఇది ఆరు నెలలుగా ఉండేది. ఈ నిడివిని తగ్గిస్తూ తాజాగా యూఎస్ సీడీసీ నిర్ణయం తీసుకున్నాయి. బూస్టర్ డోసు తీసుకుంటే ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుందని యూకే, సౌతాఫ్రికాల్లోని డేటా చెప్తోందని సీడీసీ తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)