ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌కు తాజాగా 3,000 మంది సైనికులను అమెరికా పంపిస్తోంది. కాబూల్‌లోని అమెరికన్ ఎంబసీని పాక్షికంగా ఖాళీ చేయించేందుకు వీరు సహకరిస్తారు. ఆఫ్ఘనిస్థాన్ అత్యంత వేగంగా తాలిబన్ల నియంత్రణలో వెళ్తుండటంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లోని రెండో అతి పెద్ద నగరం కాందహార్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ ప్రభుత్వ సమర్థతపై నమ్మకం తగ్గిపోయింది. ఫలితంగా అమెరికన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లోని అమెరికన్ ఎంబసీని పాక్షికంగా ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఎంబసీ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది.