Skip to main content

Namaste NRI

అమెరికా కీలక నిర్ణయం..కాబూల్ కు కొత్తగా

ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌కు తాజాగా 3,000 మంది సైనికులను అమెరికా పంపిస్తోంది. కాబూల్‌లోని అమెరికన్‌ ఎంబసీని పాక్షికంగా ఖాళీ చేయించేందుకు వీరు సహకరిస్తారు. ఆఫ్ఘనిస్థాన్‌ అత్యంత వేగంగా తాలిబన్ల నియంత్రణలో వెళ్తుండటంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లోని రెండో అతి పెద్ద నగరం కాందహార్‌ను స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ ప్రభుత్వ సమర్థతపై నమ్మకం తగ్గిపోయింది. ఫలితంగా అమెరికన్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కాబూల్‌లోని అమెరికన్‌ ఎంబసీని పాక్షికంగా ఖాళీ చేయించాలని నిర్ణయించింది. ఎంబసీ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది.

Social Share Spread Message

Latest News