Namaste NRI

అమెరికా కీలక ప్రకటన…దాంతో మాకు సంబంధం లేదు

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అమెరికా నుంచి కీలక ప్రకటన వెలువడింది. యుద్ధంలో తాము జోక్యం చేసుకోబోమని, ప్రాథమికంగా దాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ విస్పష్టంగా ప్రకటించారు. భారత్‌, పాకిస్థాన్‌ను అమెరికా కట్టడి చేయలేదు. ఉద్రిక్తతలను తగ్గించాలని మాత్రమే ఆ రెండు అణ్వస్త్ర దేశాలకు మేము సూచించగలం అని ఆయన తెలిపారు.

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అణు యుద్ధం జరిగే అవకాశాలపై ట్రంప్‌ ప్రభుత్వం ఏ రకంగా ఆందోళన చెందుతోందన్న ప్రశ్నకు అణ్వస్ర్తాలు కలిగిన రెండు దేశాలు ఘర్షణకు దిగితే అది భారీ యుద్ధానికి దారితీయగలదన్న ఆందోళన ఉందని వాన్స్‌ చెప్పారు. సాధ్యమైనంత త్వరితంగా ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పిన మాటలను ఆయన ఉటంకించారు. భారత్‌కు పాకిస్థాన్‌తో విరోధం ఉందని, అందుకు పాక్‌ జవాబిచ్చిందని ఆయన చెప్పారు. ఈ సమయంలో ఉద్రిక్తతలను కాస్త తగ్గించుకోవాలని మాత్రమే తాము చెప్పగలమని ఆయన తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events