అమెరికా వాయుసేన టీకాను తిరస్కరించిన 27 మంది సిబ్బందిని ఉద్యోగం నుంచి తప్పుకునేందుకు అనుమతించింది. సైన్యంలోని వారందరూ తప్పనిసరిగా కరోనా టీకా తీసుకోవాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కానీ కొందరు మాత్రం ఈ ఆదేశాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగం నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా ఈ నెల 27 మందినీ గౌరవప్రదమైన న్కిష్కమణకు (ఆనరబుల్ డిశ్చార్జ్) కాదా అన్న విషయం తేలాల్సి ఉంది. విధుల్లో ఉన్నతం కాలం నిబంధనలకు కట్టుబడి ఉన్న సైనికులకు మాత్రమే ఈ తరహా నిష్క్రమణకు అవకాశం ఉంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)