ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా అమితాబ్‌బచ్చన్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసీటీలో మొక్కలు నాటారు. మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నారు. మొక్కలు నాటాల్సిందిగా నా తరపున మరో ముగ్గురికి ప్రాతిపాదిస్తాను అని అమితాబ్ తెలిపారు. ప్రత్యేకంగా ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని సంతోష్‌కుమార్, అమితాబ్‌కు అందజేశారు. హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రబాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు ఇటీవలే అమితాబ్ బచ్చన్ నగరానికి వచ్చారు.