పాపులర్ కంప్యూటర్ గేమ్ టెట్రిస్‌లో అమెరికాకు చెందిన 13 ఏండ్ల బాలుడు విల్లీస్ గిబ్సన్ చరిత్ర సృష్టించా డు. నిన్‌టెండో వర్షన్ పజిల్ గేమ్‌లో కిల్ స్క్రీన్ వరకు చేరుకున్న తొలి వ్యక్తిగా గిబ్సన్ రికార్డులకు ఎక్కాడు. గతంలో ఈ ఘనతను కృత్రిమ మేధ (ఏఐ) మాత్రమే సాధించింది. ఇప్పటివరకు ఏ మానవుడూ ఈ ఘనతను సాధించలేదని, విల్లీస్ గిబ్సన్ (13) దానిని బద్దలు కొట్టాడని క్లాసిక్ టెట్రిస్ వరల్డ్ చాంపియన్‌షిప్ అధ్యక్షుడు విన్స్ క్లెమెంట్ అన్నారు. సోవియట్ రష్యాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కనుగొన్న టెట్రిస్ వీడియో గేమ్‌లో ఆటగాడు 29వ లెవల్‌కు చేరుకోవటమే గగనం. చాలా అరుదు. మనుషులు స్పందించలేని విధంగా గేమ్‌లో సవాల్ ఎదురవుతుంది. అలాంటిది విల్లీస్ గిబ్సన్ ఈ గేమ్‌లో 157వ లెవల్‌కు చేరుకోవటం గమనార్హం.














