గత కొద్ది నెలలుగా ఇజ్రాయెల్‌పై పోరాడుతున్న హమాస్‌కు కోలుకోని షాక్ తగిలింది. ఇప్పటికే సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. హమాస్ మిలటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని నెల రోజుల తర్వాత ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. మిస్సైల్ దాడుల్లో డీఫ్ మృతి చెందినట్లు పేర్కొంది. డీఫ్ అక్టోబరు 7, 2023న ఇజ్రాయెల్‌పై దాడికి సూత్రధారిగా భావిస్తున్నారు. జూలై 13న ఐడీఎఫ్ ఫైటర్ జెట్లు దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో బ్రిగేడ్ కమాండర్ మొహ్మద్ డీఫ్, రఫా సలామెహ్ ఉన్న కాంపౌండ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. అతన్ని హతమార్చేందుకు ఇజ్రాయెల్ ఏడుసార్లు ప్రయత్నించగా డీఫ్ తప్పించుకుంటూ వచ్చి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.