రష్యా అధ్యక్షునిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అధికార అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్యాలెస్‌లో సుమారు 2500 మంది అతిథుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై చేయి ఉంచి, పదవీ ప్రమాణం చేశారు. ఇప్పటికే 25 ఏండ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న పుతిన్, జోసఫ్ స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యాను పరిపాలించిన నేతగా నిలువనున్నారు.
అధ్యక్షుడు బోరిస్ ఎల్టిసిన్ తర్వాత పుతిన్ అధ్యక్షుడు లేదా ప్రధానిగా 1999 నుంచి ఈ పదవిలో ఉన్నారు 2030తో పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన తదుపరి ఎన్నికలలో పోటీ చేసేందుకు అర్హుడే. మార్చిలో జరిగిన ఎన్నికల్లో ఆయన కు పెద్దగా పోటీనిచ్చే విపక్ష నేత లేకపోవడంతో మరోసారి ఘన విజయం సాధించారు. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.