అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వారసుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన చిన్న కుమారుడు బారన్ ట్రంప్ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. 18 ఏళ్ల బారన్ ఈ వేసవిలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఈ విషయాన్ని పార్టీ చైర్మన్ ఇవన్ పవర్ వెల్లడించారు.
నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎంపికను ధ్రువీకరించేందుకు విస్కాన్సిన్‌లోని మిల్వాకీ నగరంలో జులైలో పార్టీ కన్వెన్షన్ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. వారిలో బారన్ ట్రంప్ ఒకర ని ఇవన్ పవర్ వెల్లడించారు. మార్చి 20, 2006లో బారన్ జన్మించాడు. ఈ మార్చిలో ఆయనకు 18 ఏళ్లు వచ్చాయి. వచ్చే వారమే హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ కానున్నారు. బారన్ ట్రంప్ కుటుంబంలో అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.