భరత్ హీరోగా, వాణి భోజన్ హీరోయిన్‌గా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం మిరల్. ఈ మూవీని సీహెచ్ సతీష్ కుమార్ నిర్మించారు. హారర్, సస్పెన్స్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఎం శక్తివేల్ దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఎంతగా భయపెట్టిందో తెలిసిందే. ట్రైలర్‌తో ఒక్కసారిగా మిరల్ మూవీపై మేకర్స్ భారీగా అంచనాలు పెంచేశారు.
శ్రీమతి. జగన్మోహిని అండ్ జి ఢిల్లీ బాబు సమర్పణలో రాబోతోన్న ఈ సినిమాను మే 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. సినిమా కథ ఏంటి? ఏ పాయింట్ చుట్టూ తిరుగుతుంది? ప్రధాన పాత్రలు ఏంటి? అన్నది కూడా ఈ పోస్టర్‌లోనే చూపించారు. ట్రైలర్‌లోనూ ఓ వింత మాస్క్ హైలెట్ అవుతుండటం విశేషం. ఇప్పుడు ఈ పోస్టర్‌లోనూ ఆ మాస్క్‌ను చూపించారు. అసలు ఆ మాస్క్ కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్, పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ చిత్రానికి ప్రసాద్ ఎస్ ఎన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మే 17న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.