అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నామినేషన్ స్వీకరించారు. చికాగోలో జరిగిన డీఎన్సీ మీటింగ్‌లో ఆమె నామినేషన్ ఆమోదించారు. డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ స్వీకరించిన రెండో మహిళగా కమలా హ్యారిస్ నిలిచారు. కన్వెన్షన్‌లో హ్యారిస్ మాట్లాడుతూ తన తల్లి శ్యామలా గోపాలన్‌ను గుర్తు చేసుకున్నారు. ప్రతి రోజూ తన తల్లిని మిస్ అవుతున్నట్లు ఆమె చెప్పారు.గత కొన్నాళ్లుగా తాను వెళ్తున్న దారి అసాధారణమైందన్నారు. కానీ ఇలాంటి జర్నీలు కొత్తేమీ కాదన్నారు. తన తల్లి పైనుంచి చూస్తుంటుందని, ఆమె సంతోషంతో దీవిస్తుందని ఆశిస్తున్నట్లు హ్యారిస్ తెలిపారు.
19 ఏళ్ల వయసులో తన తల్లి దేశం దాటి వచ్చినట్లు గుర్తు చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ సైంటిస్టుగా కెరీర్ కోసం తన తల్లి ఇండియా నుంచి కాలిఫోర్నియా వచ్చినట్లు కమలా హ్యారిస్ వెల్లడించారు. తన తల్లే తనను పెంచినట్లు ఆమె చెప్పారు. స్వంత ఇళ్లు కొనడానికి ముందు ఈస్ట్ బేలో ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో కిరాయికి ఉండేవాళ్లమని తెలిపారు. ఫ్లాట్‌ల్యాండ్స్ వద్ద ఉన్న తమ ఇంటి చుట్టూ ఫైర్‌ఫైటర్లు, నర్సులు, కన్‌స్ట్రక్షన్ వర్కర్లు కలగొలుపు గా ఉండేవారన్నారు. 19 ఏళ్ల వయసులో శ్యామలా గోపాలన్, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.