అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ న్యూస్ పేపర్ వాషింగ్టన్ పోస్ట్ ను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఫుట్ బాల్ టీమ్ వాషింగ్టన్ కమాండర్స్ ను కొనుగోలు చేయడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ఓ కథనం వెలువరించింది. అయితే ఈ వార్తలను బెజోస్ అధికార ప్రతినిధి ఖండించారు. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేశారు. వాషింగ్టన్ పోస్ట్ను అమ్మడం లేదని తెలిపారు. వాషింగ్టన్ పోస్ట్ను బెజోస్ 2013లో 250 మిలియన్ అమెరికన్ డాలర్లకు సొంతం చేసు కున్నారు.
