Namaste NRI

అమెరికాకు మరో భారీ షాక్‌!

అగ్రరాజ్యం అమెరికాకు మరో భారీ షాక్‌. హొర్ముజ్‌లో సీక్రెట్‌ ఆపరేషన్‌ సందర్భంగా ఆ దేశానికి చెందిన నిఘా డ్రోన్‌ ఎంక్యూ-4సీ ట్రైటన్‌ గల్లంతైంది. ఈ డ్రోన్‌ ధర రూ.1800 కోట్లకు పైమాటే. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా అత్యంత ఖరీదైన డ్రోన్‌ కనిపించకుండా పోవడం ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బే అని భావిస్తున్నారు. ఈ డ్రోన్‌ కూలిపోయిందా లేక ఇరాన్‌ కూల్చిందా అన్న విషయం తెలియరాలేదు. 2018లో ఈ డ్రోన్‌ అమెరికా అమ్ములపొదిలో చేరింది. ఇరాన్‌ యుద్ధంలో ఎఫ్‌-35, ఎఫ్‌-15ఈ, ఏ-10 యుద్ధ విమానాలను అమెరికా కోల్పోయింది. అలాగే 17 ఎంక్యూ-9 రీపర్‌ డ్రోన్లను కూడా నష్టపోయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events