Namaste NRI

శ్రీవారి భక్తులకు మరో ప్రసాదం

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ధన ప్రసాదం పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హుండీలో వేసిన నాణేలను భక్తులకు ధన ప్రసాదంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. గదుల కోసం డిపాజిట్‌ చేసిన నగదును ధన ప్రసాదం పేరుతో చిల్లర రూపంలో భక్తులకు ఇవ్వనుంది. టీటీడీ వద్ద పెద్ద మొత్తంలో చిల్లర నాణేలు పేరుకుపోతుండటం, హుండీ నాణేలను డిపాజిట్‌ చేసుకునేందుకు బ్యాంకులు సైతం ముందుకు రావడం లేదు. దీంతో చిల్లర  నాణేల నిల్వను తగ్గించేందుకు టీటీడీ ఈ నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

                భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా క్యాష్‌ ఆన్‌ డిపాజిట్‌ కూడా చెల్లిస్తుండడంతో వారు గదిని ఖాళీ చేసే సమయంలో క్యాష్‌ ఆన్‌ డిపాజిట్‌ను శ్రీవారి ధన ప్రసాదం రూపంలో చెల్లించే విధంగా ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధన ప్రసాదాన్ని తిరుమల కొండపై కౌంటర్లలో కూడా అమ్ముతున్నారు. కవర్లో కాయిన్స్‌ తో పాటు పసుపు, కుంకుమ కలిపి అమ్ముతారు.  వంద రూపాయలు చెల్లించి ఈ ధన ప్రసాదాన్ని తీసుకోవచ్చు. లడ్డు ప్రసాదం కొనుక్కున్నట్టుగానే కాయిన్స్‌ ప్రసాదం తీసుకోవచ్చు. ప్రస్తుతం ఒక్క రూపాయి నాణేలను ధన ప్రసాదంగా ఇస్తుండగా.. రానున్న రోజుల్లో 2, 5 రూపాయల నాణేల ప్యాకెట్‌ లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది టీటీడీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events