ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనా అత్యున్నత పురస్కారం అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఘనాలో పర్యటిస్తున్న మోదీకి, ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా తో సత్కరించింది. ఘనా రాజధాని అక్రలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా ఈ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఘనా జాతీయ గౌరవ దక్కడం నాకు చాలా గర్వకారణం, గౌరవం. ఇది భారత్-ఘనా మధ్య ఉన్న బలమైన, చిరకాల సంబంధాలకు నిదర్శనం. అధ్యక్షుడు మహామా, ఘనా ప్రభుత్వం, ఘనా ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 140 కోట్ల మంది భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా స్వీకరిస్తున్నారు. ఇది మన యువత ఆకాంక్షలు, వారి ఉజ్వల భవిష్యత్తుకు, మన గొప్ప సాంస్కతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, భారతదేశం, ఘనా మధ్య చారిత్రక సంబంధాలకు అంకింతం చేస్తున్నాను అని అన్నారు.
















