Skip to main content

Namaste NRI

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం

ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన ఘనా అత్యున్నత పురస్కారం అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఘనాలో పర్యటిస్తున్న మోదీకి,  ఆ దేశ అత్యున్నత పురస్కారం ఆఫీసర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఆఫ్‌ ఘనా తో సత్కరించింది. ఘనా రాజధాని అక్రలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్‌ ద్రమాని మహామా ఈ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఘనా జాతీయ గౌరవ దక్కడం నాకు చాలా గర్వకారణం, గౌరవం. ఇది భారత్‌-ఘనా మధ్య ఉన్న బలమైన, చిరకాల సంబంధాలకు నిదర్శనం. అధ్యక్షుడు మహామా, ఘనా ప్రభుత్వం, ఘనా ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 140 కోట్ల మంది భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా స్వీకరిస్తున్నారు. ఇది మన యువత ఆకాంక్షలు, వారి ఉజ్వల భవిష్యత్తుకు, మన గొప్ప సాంస్కతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, భారతదేశం, ఘనా మధ్య చారిత్రక సంబంధాలకు అంకింతం చేస్తున్నాను అని అన్నారు.

Social Share Spread Message

Latest News