Namaste NRI

ఆర్‌ఆర్‌ఆర్‌ కు మరో అరుదైన గౌరవం

 ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం జపాన్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా తాజాగా ప్రకటించిన 50వ శాటర్న్‌ పురస్కారాల్లో బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ మూవీగా ఎంపికైంది. అమెరికాకు చెందిన శాటర్న్‌ అవార్డులను ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలు అందుకుంటాయి. బెస్ట్‌ యాక్షన్‌ అడ్వైంచర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఇలా మూడు విభాగాల్లో అవార్డులను ఈ సినమాను నామినేట్‌ చేశారు.  ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ.. మా చిత్రానికి శాటర్న్‌ అవార్డ్‌ దక్కడం సంతోషంగా ఉంది. జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు. ప్రస్తుతం జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రదర్శన కార్యక్రమాల్లో ఉండటం వల్ల ఈ పురస్కార కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నా, ఇతర పురస్కార విజేతలకు శుభాకాంక్షలు అని అన్నారు.

                విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు,  కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తిగా అల్లుకున్న కల్ఫిత కథతో రూపొందిన చిత్రమిది. అల్లూరిగా రామ్‌చరణ్‌ నటించగా భీమ్‌ పాత్రను ఎన్టీఆర్‌ పోషించారు.  ఈ సినిమాని ఈ ఏడాది ఆస్కార్‌ బరిలోకి దించనున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events