వర్క్ పర్మిట్‌పై అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇమిగ్రేషన్ పాలసీలో మరో ప్రధాన మార్పును చేసినట్టు ట్రంప్ పరిపాలనా విభాగం ప్రకటించింది. కొంతమంది శరణార్థ్ధులకు జారీ చేసే వర్క్ పర్మిట్ చెల్లుబాటు కాలాన్ని ఐదేండ్ల నుంచి 18 నెలలకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.వలస విధాన కఠిన చర్యల్లో భాగంగా, అమెరికా వలసదారుల తనిఖీ, స్క్రీనింగ్‌ను పెంచే లక్ష్యంతో ఈ మార్పు చేసినట్టు పేర్కొంది. ఈ నిబంధన ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకుని ఉన్న వారికి, ఆ రోజుకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులందరికీ వర్తిస్తుంది. యూఎస్ పౌరసత్వం, వలస సేవలు (యూఎస్‌సీఐఎస్) దాని మాన్యువల్‌లో ఈ మేరకు మార్పును తెస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల అధ్యక్ష భవనానికి సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డులపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోకి వలస వచ్చేవారిపై కఠిన సమీక్షలు అవసరమని ట్రంప్ పరిపాలనా యంత్రాంగం భావిస్తోంది. ఈ క్రమంలోనే వర్క్ పర్మిట్ల కాలవ్యవధిపై నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
















