Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో షాక్‌…లైంగిక సంబంధాలు నిజమే

హష్‌ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరో షాక్‌ తగిలింది. డొనాల్డ్‌ ట్రంప్‌ అతని హోటల్‌ సూట్‌లోని బెడ్‌పై సెక్స్‌లో పాల్గొన్నట్టు అడల్ట్‌ స్టార్‌ స్మార్మీ డేనియల్స్‌ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ సమయంలో ట్రంప్‌ కండోమ్‌ వాడారా? అని అడిగిన ప్రశ్నకు, లేదు అని డేనియల్స్‌ సమాధాన మిచ్చారు. ట్రంప్‌తో 2006నాటి లైంగిక సంబంధాన్ని కోర్టుకు వివరించారు. ఆమెతో శారీరక సంబంధం 2016 ఎన్నికల ప్రచార సమయంలో బయటకు రాకుండా అనైతిక ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణల్ని ట్రంప్‌ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై కోర్టులో క్రిమినల్‌ నేరారోపణలు నమోదయ్యాయి.

Social Share Spread Message

Latest News