Skip to main content

Namaste NRI

హ్యాపీ బర్త్‌డే జయమ్మ.. రణబాలి నుంచి రష్మిక మందన్న స్పెష‌ల్ వీడియో

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌రణబాలి. 19వ శతాబ్దంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం బర్త్‌డే స్పెషల్‌ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో జయమ్మగా రష్మిక మారిన పరిణామక్రమాన్ని చూపించారు. రణబాలి బలం జయమ్మ అతని సంతోషాలకు కారణం జయమ్మ అంటూ వీడియోలో పేర్కొనడం ఈ జంట మధ్య ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది. ఇటీవలే ఈ సినిమా అనంతపూర్‌ షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న విషయం విదితమే. ఈ ఏడాది సెప్టెంబర్‌ 11న గ్రాండ్‌గా సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News