Skip to main content

Namaste NRI

మిత్రదేశాల నుంచి తమకు ఎటువంటి సహాయం అందడం లేదు : జెలెన్‌స్కీ ఆవేదన

పశ్చిమాసియా యుద్ధం కారణంగా అమెరికా తమకు ఇవ్వాల్సిన సైనిక, ఆయుధ సరఫరాను తగ్గించి ఇజ్రాయెల్‌కు తరలిస్తున్నదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధమిలాగే కొనసాగితే అగ్రరాజ్యం నుంచి తమకు వస్తున్న మద్దతు భవిష్యత్‌లో తగ్గే అవకాశం ఉందని అన్నారు. రష్యా ఉపయోగిస్తున్న బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకోవడానికి తాము అమెరికా సరఫరా చేసే పేట్రియాట్‌ వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించినట్టు చెప్పారు.

అయితే వాటి సరఫరా ఆగిపోవడంతో యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆయుధ నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని ఆయన చెప్పారు. యుద్ధం ప్రభావం కారణంగా మిత్రదేశాల నుంచి కూడా తమకు ఎటువంటి సహాయం అందడం లేదని ఆయన అన్నారు. ఇదే అదనుగా రష్యా తమపై దాడులను తీవ్రం చేస్తున్నదని ఆయన వాపోయారు.

Social Share Spread Message

Latest News