చైనాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తుంది. లాంగ్యా హెనిపా అనే వైరస్ ఇప్పుడు చైనా ప్రజలను కలవరపరుస్తోంది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సమాచారం. ఈ క్రమలో ఓ వ్యక్తి అధికంగా ఫీవర్ ఉండడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా, అతనికి వైరస్ నిర్ధారణ అయింది. అయితే ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, ఆకలి లేకపోవడం, వికారంగా ఉండడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన విషయం విదితమే.