Skip to main content

Namaste NRI

చైనాలో మరో వైరస్‌ కలకలం

చైనాలో  మరో వైరస్‌ కలకలం సృష్టిస్తుంది. లాంగ్యా హెనిపా అనే వైరస్‌ ఇప్పుడు చైనా ప్రజలను కలవరపరుస్తోంది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సమాచారం. ఈ క్రమలో ఓ వ్యక్తి అధికంగా ఫీవర్‌ ఉండడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా, అతనికి వైరస్‌ నిర్ధారణ అయింది. అయితే ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, ఆకలి లేకపోవడం, వికారంగా ఉండడం వంటి లక్షణాలు ఈ వ్యాధిలో ఉంటాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఇప్పటికే ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన విషయం విదితమే.

Social Share Spread Message

Latest News