దేశమంతా వినాయక చవితికి ఏ నిబంధనలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అవే అమలు చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేవుడిని రాజకీయల్లోకి లాగొద్దని బీజేపీ, టీడీపీ నేతలకు హితవు పలికారు. వినాయక చవితి పండగపై టీడీపీ, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో విపక్ష పార్టీలు రాజకీయం చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నాయని విమర్శించారు. వినాయక చవితితోను చంద్రబాబు లోకేశ్‌లు రాజకీయం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ అని మతాల విశ్వాసాలను గౌరవిస్తారన్నారు.