Namaste NRI

యాపిల్ బిగ్ షాక్ -భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు

 అమెరికాలోని యాపిల్ సంస్థ సుమారు 600 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. కాలిఫోర్నియాలోని కుపెర్టి నోలో ఉన్న ప్ర‌ధాన కార్యాల‌యం ఈ విష‌యాన్ని తెలిపింది. స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లేల‌కు చెందిన ప్రాజెక్టుల‌ను నిలిపివేయ‌డంతో ఆ సంస్థ ఉద్యోగుల్ని తొల‌గించింది. కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ శాఖ‌లో యాపిల్ సంస్థ ఉద్యోగుల తొల‌గింపున‌కు చెందిన రిపోర్టును పొందుప‌రిచారు. తొల‌గించబ‌డిన ఉద్యోగుల్లో 87 మంది యాపిల్ ఫెసిలిటీ సెంట‌ర్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. వాళ్లు నెక్ట్స్ జ‌న‌రేష‌న్ స్క్రీన్లు త‌యారు చేయ‌డంలో ఇన్నాళ్లూ ప‌నిచేశారు. ఫిబ్ర‌వ‌రి నెల చివ‌ర ఉద్యోగుల తొల‌గింపు గురించి యాపిల్ సంస్థ చ‌ర్య‌లు ప్రారంభించింది.

Social Share Spread Message

Latest News