
కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రానికి అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. మండుతున్న జ్వాలల మధ్య నడిచి వస్తున్న కల్యాణ్‌రామ్, విజయశాంతి పాత్రలు కథలోని ఇంటెన్సిటీని ప్రజెంట్ చేసేలా ఉన్నాయి.

యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం అని చిత్రబృందం పేర్కొంది. సోహైల్‌ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు, రచన-దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.
