Skip to main content

Namaste NRI

అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి..  ఫస్ట్‌లుక్‌  పోస్టర్‌ విడుదల

కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న తాజా చిత్రానికి అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో విజయశాంతి ఐపీఎస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. మండుతున్న జ్వాలల మధ్య నడిచి వస్తున్న కల్యాణ్‌రామ్‌, విజయశాంతి పాత్రలు కథలోని ఇంటెన్సిటీని ప్రజెంట్‌ చేసేలా ఉన్నాయి.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇప్పటికే టాకీ పార్ట్‌ పూర్తయింది. త్వరలో రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం అని చిత్రబృందం పేర్కొంది. సోహైల్‌ఖాన్‌, సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ప్రసాద్‌, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, నిర్మాతలు: అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు, రచన-దర్శకత్వం: ప్రదీప్‌ చిలుకూరి.

Social Share Spread Message

Latest News