Namaste NRI

కల్కి నుంచి అశ్వత్థామ ఆగమనం   

 ప్రభాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 2898 ఏడీ . ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా,  నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. దీపికా ప‌దుకొనే, దిశా ప‌టానీ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌ 27న ప్రేక్ష‌కుల ముందుకు సినిమా రానుంది. ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌భాస్ అభిమానులు ట్రైల‌ర్ కోసం ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ట్రైల‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేయ‌బోతు న్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీనితో పాటు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

అయితే ట్రైల‌ర్ మ‌రో మూడు రోజుల్లో విడుద‌ల కానుంద‌ని తాజాగా మరో అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌‌ అమితా బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అశ్వద్ధామాగా ఆయన కనిపించబోతున్నారు. ఇప్పటికే అభితాబ్‌ లుక్‌ని పరిచయం చేస్తూ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. తాజాగా ట్రైలర్‌ను ఇంకా మూడు రోజులే ఉంటూ అమితాబ్‌ బచ్చన్‌ కొత్త పోస్టర్ రిలీజ్‌ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో అశ్వత్థామ పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. ఈ పోస్టర్‌లో అమితాబ్‌ బచ్చన్‌ ఒక చేతిలో ఆయుధం, మరో చేతి పెద్ద కర్ర పట్టుకుని కనిపించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events