మిస్ వరల్డ్ అమెరికా 2021 గెలుచుకున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా శ్రీ సైనీ నిలిచింది. అమెరికాలోని వాషింగ్టన్‌కి చెందిన శ్రీసైని ప్రపంచ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి అమెరికన్ కావడం విశేషం. ఈ మేరకు లాస్ ఏంజెల్స్‌లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో డయానా హెడెన్ శ్రీ సైనికి ఈ కిరీటాన్ని బహుకరించింది. ఈ సందర్భంగా శ్రీ సైని మాట్లాడుతూ నేను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నా భావాలను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా అమ్మనాన్నలకే దక్కుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్ వరల్డ్ అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ ఫోర్డ్స్ సిటీ ఆఫ్ న్యూజెర్సీలో జరిగిన పోటీలో శ్రీ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018 కిరీటాన్ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)