Skip to main content

Namaste NRI

మిస్ వరల్డ్ అమెరికాగా.. భారత సంతతి అమెరికన్ శ్రీ సైనీ

మిస్‌ వరల్డ్‌ అమెరికా 2021 గెలుచుకున్న తొలి భారత సంతతి అమెరికన్‌గా శ్రీ సైనీ నిలిచింది. అమెరికాలోని వాషింగ్టన్‌కి చెందిన శ్రీసైని ప్రపంచ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి అమెరికన్‌ కావడం విశేషం. ఈ మేరకు లాస్‌ ఏంజెల్స్‌లోని మిస్‌ వరల్డ్‌ అమెరికా ప్రధాన కార్యాలయంలో డయానా హెడెన్‌ శ్రీ సైనికి ఈ కిరీటాన్ని బహుకరించింది. ఈ సందర్భంగా శ్రీ సైని మాట్లాడుతూ నేను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నా భావాలను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్‌ అంతా మా అమ్మనాన్నలకే దక్కుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్‌ వరల్డ్‌ అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ ఫోర్డ్స్‌ సిటీ ఆఫ్‌ న్యూజెర్సీలో జరిగిన పోటీలో శ్రీ మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ 2018 కిరీటాన్ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News