ప్రవాస భారతీయుడు, శాస్త్రవేత్త మిరియాల మురళీధర్‌కు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అవార్డు అందజేసింది. 18వ ఆటా సదస్సులో భాగంగా ఆయనకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎక్స్‌లెన్స్ అవార్డును నిర్వాహకులు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేతులమీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ అవార్డు అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఆటా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని తన పాత మిత్రులను కలుసుకునే అవకాశం లభించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు రాజకీయ నాయకులను కలుసుకునే అవకాశం ఈ వేదిక ద్వారా దక్కిందన్నారు.