అమెరికా తెలుగు సంఘం (ఆటా) వేడుకల్లో భాగంగా ఈ నెల 17న హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు లిటరరీ కమిటీ చైర్మన్ వేణు నక్షత్రం తెలిపారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, ప్రెసిడెంట్ ఎలక్ట్, వేడుకల చైర్ జయంత్ చల్లా, కో చైర్ వేణు సంకినేని, వేణు నక్షత్రంల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిద్ధారెడ్డి హాజరవుతారన్నారు. ఆటా .. మాట పేరుతో మధు బొమ్మినేని సాహిత్య వేడుకలు పేరుతో జయంత్ చల్లా, ఆటా సాహిత్య సేవలను గురించి రాజేశ్వరరావు టేక్మార్ మాట్లాడనున్నారు. ముగింపు కార్యక్రమానికి జి. కిషన్‌రావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జూలూరు గౌరీశంకర్, మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథిగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పాల్గొంటారు.
ఈ సందర్భంగా జరిగే సాహిత్య కార్యక్రమాల్లో శాంతిస్వరూప్, ఐనంపూడి లక్ష్మి, జె.శ్రీనివాస్, సంగిశెట్టి శ్రీనివాస్, స్వామి ముద్ధం, జెఎల్. నరసింహారెడ్డి, నలిమెల భాస్కర్, దెంచనాల శ్రీనివాస్, కొలకలూరి మధుజ్యోతి, నరాల రామిరెడ్డి, కొండపల్లి నీహారిణి, టి.గోపాల్ రెడ్డి, మధురాంతకం నరేంద్ర, మధుబాబు, పి.అశోక్‌కుమార్, వెంకట్రామిరెడ్డి, మహ్మద్‌గౌస్, హుమయూన్ సంఫీుర్, పత్తిపాక మోహన్, ఎస్వీ, సత్యనారాయణ, మువ్వా శ్రీనివాసరావు, నాళేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, ఎం.హైమవతి, కందకూరి శ్రీరాములు, జల్లేపల్లి బ్రహ్మం, యాకూబ్, వెల్దండి శ్రీధర్, రవీందర్, గోరెటీ వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, దేశపతి శ్రీనివాస్, పెంచలదాస్, రామప్రసాదరెడ్డి, తప్పెట రామప్రసాద్ రెడ్డి, బలగం వేణు, అల్లాణి శ్రీధర్, మామిడి హరికృష్ణ, షరీఫ్ మహ్మద్‌లు పాల్గొంటారన్నారు.